హామీలు అమలు చేయని చంద్రబాబును రీకాల్ చేయాల్సిందేనని మాజీ ఎంపీ మాగాని భరత్ శనివారం అన్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పార్టీతో నిమిత్తం లేకుండా జగన్ పేదలకు పథకాలు అమలుచేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం పథకాల ఎంపికలో పక్షపాతం చూపడం దారుణం అని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. బూత్ స్థాయినుంచి పార్టీని పటిష్టం చేసుకుని ప్రజల్లోకి ధైర్యంగా వెళ్దామని అన్నారు.