రాజమండ్రి నగరంలో ఆర్ట్స్ కాలేజీ గ్రాండ్ ట్రంక్ రోడ్డు వద్ద 17వ రోజు యోగాంధ్ర కార్యక్రమం బుధవారం జాయింట్ కలెక్టర్ చిన రాముడు సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6:30 నుంచి 7:30 వరకు అధికారులు, మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, ప్రజలకు యోగ పై అవగాహన కల్పించి అనేక యోగాసనాలు చేశారు. వ్యాపారవేత్తలు, వ్యాపారులు అందరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలన్నారు.