యువత డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని, వీటిని నియంత్రించే క్రమంలో మూలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని జేసీ ఎస్. చిన్న రాముడు అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం రాజమండ్రిలోని కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నవోదయం 2. 0 పురోగతి, ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.