పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన సర్వేయర్ సస్పెండ్

53చూసినవారు
పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన సర్వేయర్ సస్పెండ్
రాజమండ్రి రూరల్ మండలం పాలమూరు గ్రామ సచివాలయ సర్వేయర్‌గా పని చేస్తున్న కే. వెంకటాచారి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. లబ్ధిదారుల నుంచి అతను రూ. 300 వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ అయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్