మిర్తిపాడు గ్రామంలో పర్యటించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

59చూసినవారు
మిర్తిపాడు గ్రామంలో పర్యటించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కె. ఎస్ జవహర్ సోమవారం సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో పర్యటించారు. దీంతో గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు నున్నా రామారావు అనారోగ్యంతో చనిపోయాడని విషయం తెలుసుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ వీరరాఘవులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్