పహల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' విజయవంతం అయిన సందర్భంగా రాజమండ్రిలో ఈ నెల 17న తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, యానాపు ఏసు తెలిపారు. గురువారం రాజమండ్రిలో వారు మాట్లాడారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు పుష్కర ఘాట్ నుండి యాత్ర ప్రారంభమై కోటిపల్లి బస్టాండ్ స్వతంత్ర సమరయోధులు పార్కు వరకు సాగుతుందన్నారు.