రాజమండ్రి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. నగర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, స్పెషల్ అధికారులు, వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.