బొమ్మూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త నవర అరుణ్ సాయికి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ ప్రయోజనం ద్వారా రూ. 50,000 ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని మంత్రి అన్నారు.