ధవళేశ్వరం: కాలువలు మూసివేస్తారా..? నీటి విడుదల పొడిగిస్తారా!

68చూసినవారు
ధవళేశ్వరం: కాలువలు మూసివేస్తారా..? నీటి విడుదల పొడిగిస్తారా!
డెల్టా కాలువలు మూసివేస్తారా.. లేక నీటి విడుదల పొడిగిస్తారా అనే దానిపై సందిగ్దత నెలకొంది. రబీ అనంతరం ఖరీ ఫ్‌ సీజన్‌లో నీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు క్లోజర్‌ పనులు చేపట్టేందుకు డెల్టా కాలువలను బుధవారం నుంచి మూసివేయాలని ఇరిగేషన్‌ అధికారులు గతంలోనే నిర్ణయించారు. అయితే శివా రు ఆయకట్టు భూములకు ఇంకా నీటి అవసరత ఉండడం, గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపుకోవడం తదితర పను లు పూర్తిస్థాయిలో జరగలేదు. రబీ అవ సరాలు తగ్గిన తరువాత గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపుకోవడానికి మరో నాలుగైదు రోజులు కాల్వలకు నీరు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు.

సంబంధిత పోస్ట్