మురమండలో విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ

62చూసినవారు
మురమండలో విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ
కడియం మండలం మురమండ జెడ్పి పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ కిట్స్ ను విద్యాకమిటి చైర్మన్ విప్పర్తి సత్యవతి సమక్షంలో విద్యార్థులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బొండాడ సుధ మాట్లాడుతూ పాఠశాలలోని 286 మంది విద్యార్థులకు గ్రామపెద్దలు, విద్యాకమిటీ సభ్యులతో కలిసి స్కూల్ కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ మీరాబాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్