రాజమండ్రి నగరంలో కొద్ది రోజులుగా ఎండ వేడితో అల్లాడిన ప్రజలకు బుధవారం ఓ ఊరట లభించింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, డ్రైనేజీలు ఉప్పొంగాయి. ప్రజలకు, ప్రయాణికులకు రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో కొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.