కడియం మండలంలోని కడియపులంకలో కొలువైయున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖ నర్సరీ రైతు పల్ల వెంకన్న కుమారులు సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం గణపతి ఆధ్వర్యంలో మంగళ అఖండ హారతులు నిర్వహిస్తామని చెప్పారు.