గ్రామంలోని పల్లపు ప్రాంతాలు నీట మునగకుండా ముందస్తు ప్రణాళికలతో గ్రామంలో గల అన్ని డ్రైన్లలో మూసుకుపోయిన పూడికలను యుద్ధ ప్రాతిపదికపై తొలగిస్తున్నట్లు కడియం మండలం కడియపులంక సర్పంచ్ పాఠంశెట్టి వెంకట రామారావు శనివారం వెల్లడించారు. వర్షాలకు డ్రైనేజీలో చెత్త చెదారం బాగా పేరుకుపోయాయన్నారు. డ్రైనేజీలో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా పూడికలను తొలగిస్తున్నట్లు తెలిపారు.