రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్చ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు అందరూ కృషి చేయాలని తూ. గో జిల్లా పంచాయతీ అధికారి శాంతకుమారి సూచించారు. శనివారం కడియం మండలం మాధవరాయుడుపాలెం, వేమగిరి, కడియపుసావరం గ్రామాలలో పర్యటించారు. పలువురి ఇంటికి వెళ్లి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు.