సమాజంలోని అసమానతలను దూరం చేసేది, మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసేది విద్య కాబట్టి విద్యార్థులకు విద్యే ధ్యేయంగా ఉండాలని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అన్నారు. గురువారం కడియం ఏవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను ఎంపీపీ అందజేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం ఆహారాన్ని వడ్డించారు.