రైతే రాజు అనే ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కడియం మండలం వేమగిరి గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువుల షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చి రైతుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు.