కడియంలోని వెంకట సూర్య థియేటర్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ వనుములమ్మ తల్లి అమ్మవారు జాతర మహోత్సవం ఈనెల 14వ తేదీ శనివారం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా జాతరలో అమ్మవారి గరగలు, పలు సాంస్కృతిక నృత్యాలు అలాగే బుట్ట బొమ్మలు మొదలగు ప్రదర్శనలు ఉంటాయన్నారు. అనంతరం 15వ తేదీ ఆదివారం అమ్మవారి తీర్థం జరుగుతుందని వెల్లడించారు.