కడియం పంచాయతీ కార్యాలయం నందు కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, ఎంపీడీవో రమేష్ అధ్యక్షతన యోగాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం ఒక అరగంట యోగ చేస్తుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా యోగ, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలని వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేశారు.