కాతేరు: రోజులో ఒక పూట ఎండా.. ఒక పూట వర్షం

80చూసినవారు
కాతేరు: రోజులో ఒక పూట ఎండా.. ఒక పూట వర్షం
రాజమండ్రి గ్రామీణo కాతేరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుల వల్ల ఏకధాటిగా గంటసేపు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు ఐదు రోజుల నుంచి పగలు అంతా ఎండా కాసి, సాయంత్రం 6 దాటేసరికి భిన్న వాతావరణం మారి ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. దీంతో పరిసర ప్రాంతాల లో చేతికొచ్చిన వరి పంట, అరటి తోట, మామిడి తోట రైతులు పంట దెబ్బ తినడంతో గగ్గోలు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్