పెన్షన్ల పంపిణీని పరిశీలించిన ఎంపీడీవో

78చూసినవారు
పెన్షన్ల పంపిణీని పరిశీలించిన ఎంపీడీవో
కడియం మండలంలోని అన్ని గ్రామాలలో గురువారం ఉదయం సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. మండలంలోని పలు గ్రామాలలో ఎంపీడీవో రాజ్ మనోజ్ పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. లబ్ధిదారులందరూ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా సకాలంలో తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందివ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్