కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు తొలగించేందుకు కుట్ర చేస్తోందని అఖిలభారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఆరోపించారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఒక్క దివ్యాంగ పెన్షన్‌ను తొలగించినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.