ప్రతిపక్షం విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి విశేష స్పందనకు కారణం ప్రజా మద్దతేనని, ప్రజల సంపూర్ణ మద్దతు లభించిందని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ లో విద్యార్థి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.