రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్కేవీటీ మహిళా కళాశాల వద్ద ఉన్న ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో జరిగిన "అంగన్వాడీ పిలుస్తోంది రా" కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్ లు, కుక్కర్లు పంపిణీ చేశారు.