రాజమండ్రి: బిజెపి క్రియాశీల సభ్యుల సమావేశంలో ఎంపీ.

67చూసినవారు
రాజమండ్రి: బిజెపి క్రియాశీల  సభ్యుల సమావేశంలో ఎంపీ.
రాజమండ్రి రూరల్, సిటీ అసెంబ్లీ పరిధిలో క్రియాశీల సభ్యుల సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. పార్టీ అంతర్గత విషయాలను చర్చించి సభ్యులకు వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె అన్నారు. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, అసెంబ్లీ కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్