రాజమండ్రి :రేపు నల్ల రంగు చీరలతో నిరసన

83చూసినవారు
రాజమండ్రి :రేపు నల్ల రంగు చీరలతో నిరసన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మీ సోమవారం అన్నారు. అందుకు నిరసనగా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు మంగళవారం ఉదయం 10: 00 మహిళా శ్రేణులు నల్ల రంగు చీర ధరించుకుని గోకవరం బస్టాండ్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వున్న అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం అందజేస్తామని మార్తి లక్ష్మి అన్నారు.

సంబంధిత పోస్ట్