రాజమండ్రి రూరల్ పరిధిలోని ఆర్.డి.యస్.యస్ కొత్త ఫీడర్ పనుల నిమిత్తం 33కేవి సంపత్ నగరం ఫీడర్ కు ఈనెల 16వ తేదీన విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ నటరాజన్ బుధవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జేగురుపాడు పాములమెట్ట హౌసింగ్ కాలనీ, చైతన్య నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, రామదాసు పేపర్ మిల్లు తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.