రాజమండ్రి రూరల్: విద్యార్థులకు క్రీడలు కూడా అంతే ముఖ్యం

64చూసినవారు
రాజమండ్రి రూరల్: విద్యార్థులకు క్రీడలు కూడా అంతే ముఖ్యం
విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులు క్రీడా రంగంలో బాగా రాణించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి మండలం రాజవోలు గ్రామంలో స్థానిక హై స్కూల్ నందు నూతనంగా నిర్మించిన బాస్కెట్ బాల్ కోర్టును ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్