నగరంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం నాగులచెరువు బజార్ వద్దనున్న మున్సిపల్ క్రికెట్ స్టేడియం గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.