కందుకూరి వీరేశలింగం సమాజం కోసం తన యావదాస్తిని వదులుకున్న మహనీయులని, గొప్ప సంఘ సంస్కర్త అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని ఆనంద గార్డెన్స్ నందు కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి వారి సమాధుల వద్ద ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు. కందుకూరి వీరేశలింగం ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించారని కొనియాడారు.