వేసవి కాలంలో విజ్ఞానంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా మే 1 నుంచి మే 30 వరకు వివిధ క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని కలెక్టర్ ఛాంబర్ లో క్రీడా శిక్షకులకు కిట్లు అందచేశారు. జిల్లా క్రీడా సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాల్లో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.