ఎమ్మెల్యేను కలిసిన సచివాలయ సిబ్బంది

77చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన సచివాలయ సిబ్బంది
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందడంతో ఆయనను కడియం మండలం సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సిబ్బంది పనితీరు బాగుందన్నారు. ఈ ప్రభుత్వంలో కష్టపడి పని చేయాలని, మీకు అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగ భద్రత ఉంటుందని తెలిపారు.