రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం వద్ద గురువారం రాత్రి ఒంటి గంటకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం 11. 70 అడుగులకి చేరిందని అధికారులు తెలిపారు. సర్‌ప్లస్ వాటర్ 9, 86, 016కి చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు ప్రకటించారు. ఈ మేరకు రివర్ కన్జర్వేటర్ & గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు.