పెదపూడి మండలం పెద్దాడలో మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వృధా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని బొడ్డు భాస్కర రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొడ్డు సేవలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.