కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన దోసపాటి అరవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 50, 085 చెక్కుని జనసేన పార్టీ కో- ఆర్డినేటర్ వెంకటలక్ష్మి సోమవారం అందజేశారు. భాదిత కుటుంబానికి స్వయంగా అందజేయడంతో చెక్కులను అందుకున్న కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.