తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం గ్యాస్ లారీ బీభత్సం సృష్టించింది. తోకాడ గ్రామంలో గ్యాస్ లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూరగాయల దుకాణంలోకి దూసుకెళ్లింది. షాప్ ముందు ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జనుజ్జయ్యాయి. అయితే లారీ ఉన్నవి ఖాళీ గ్యాస్ సిలిండర్లు కావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.