సీతానగరం మండలం పురుషోత్తపట్నం దాటిన తరువాత పాత అంగుళూరు సమీపంలో పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు జరిగే ప్రదేశంలో భారీ యంత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటువైపు ప్రయాణించే వాహనదారులు గురువారం ఈ యంత్రాల వద్ద ఆగి సెల్ఫీలు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆకాశాన్ని అంటుకునే విధంగా ఉన్న ఈ యంత్రాలను చూడడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.