కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ, రైతన్నలకు అన్నివిధాలా అండగా ఉంటుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ, ఏపీ ప్రభుత్వం వారిచే రైతులకు 2025 ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ చేస్తామన్నారు.