కోరుకొండ మండలం దోసకాయల పల్లి పీహెచ్సీనీ జిల్లా కలెక్టర్ ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, చికిత్స విధానాలు అందుబాటులో ఉండాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. రోగులతో మాట్లాడి వారి వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు.