కోరుకొండ మండలం గాడాల గ్రామం తొర్రేడు పుంత రోడ్డు వద్ద బుధవారం 'ఏరువాక పౌర్ణమి' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని నాగలి చేతబట్టి భూమిని దున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున రైతులందిరికీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. పక్కా ప్రణాళికలతో రైతును అభివృద్ధి చేస్తామన్నారు.