తమ బ్లడ్ బ్యాంకు, విద్యాసంస్థలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేసిన విమర్శలను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఖండించారు. మంగళవారం కోరుకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్లడ్ బ్యాంకును చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని పారదర్శకంగా నిర్వహిస్తుంటే దానిని విమర్శించడం ఆయన స్థాయికి తగదన్నారు. వేలాదిమంది విద్యార్థులను తయారుచేసిన విద్యాసంస్థపై విమర్శలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.