కోరుకొండ: రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే బత్తుల

80చూసినవారు
కోరుకొండ: రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే బత్తుల
పౌర్ణమి సందర్భంగా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ పండితులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్