ప్రజలకు సేవ చేయడమే నా ప్రధాన ధ్యేయమని, అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం కోరుకొండలో కొలువైయున్న శ్రీ గంటాలమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి, అన్న సమారాధన కార్యక్రమానికి మొత్తం రూ. 1, 25, 000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.