ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సత్వర సేవలు అందించాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శనివారం కోరుకొండ మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మండల అధికారులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకమైన సేవలందించాలని సూచించారు.