కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.