మలికిపురం: అధ్వానంగా మారిన వీవీ మెరక రోడ్డు

78చూసినవారు
మలికిపురంలో స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి నుంచి వి. వి. మెరక వెళ్లే ప్రధాన రహదారి పూర్తి అధ్వానంగా మారింది. అల్పపీడ నేపథ్యంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వాహనాలు గోతులలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మంగళవారం చెప్పారు. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్