రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల ఎంపీడీవో కార్యాలయాన్ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ఆకస్మాత్తుగా సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫోటోలను తొలగించకపోవడంతో ఎంపిడిఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకుఇంకా వారిపై ప్రేమపోలేదంటూ విమర్శిస్తూ తక్షణమే వాటిస్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఉంచాలని ఆదేశించారు.