రాజమండ్రి మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై కలెక్టర్ అధికారులతో సమీక్షించి సంబంధిత వివరాలను ఆరా తీశారు. అదృష్టవశాత్తు ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. పని చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని అధికారులకు సూచించారు.