మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవల్‌లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తారని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగంలో ఎక్కువసార్లు సవరణలు జరిగాయని చెప్పారు.