కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగా అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రాజానగరం మండలంలో నరేంద్రపురం, కలవచర్ల పార్టీ శ్రేణులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని ఆరోపించారు.