రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ ను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకట లక్ష్మి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న పిల్లలతో ముచ్చటించారు. అనంతరం పిల్లలకు ఇచ్చే పౌష్ఠిక ఆహరం గురించి సిబ్బంది ని అడిగి, తెలుసుకొని పరిశీలించారు. నాణ్యత లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.